పాక్ టీమ్‌కు అత్యుత్తమ భద్రత : షిండే
ఢిల్లీ నవంబర్ 8, (జనంసాక్షి)
క్రికెట్ సీరిస్ ఆడడానికి భారత దేశానికి వస్తున్న పాకిస్తాన్ ఆటగాళ్ళను, చూడటానికి వచ్చే ఆ దేశ పౌరులకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. భారత్,పాకిస్తాన్ సీరిస్‌ను అడ్డుకుంటామని శివసేన ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం ఢిల్లీలో ఈ ప్రకటన చేశారు. క్రీడలను, రాజకీయాలను కలపకూడదని,ఈ క్రికెట్ సీరిస్ భారత్,పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపదటానికి సాయపడుతుందని అన్నారు. ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదని,ఏ ఇతర దేశం నుంచి క్రికెటర్‌లు భారత్‌కు వచ్చినా వారికి భధ్రత కల్పించడం మన భాధ్యత అని అన్నారు. పాకిస్తాన్ క్రికెటర్లు ,ప్రేక్షకుల భధ్రత విషయంలో రాజీ పడబోమని క్షుణ్ణంగా చర్చించి అత్యుత్తమ భద్రతను కల్పిస్తామని అన్నారు… ఈ ఏడాది డిసెంబర్, వచ్చే జనవరి మధ్యలో ఇరు దేశాల మధ్య మూడు వన్డేలు, రెండు టీ20 ఇంటర్నేషనల్‌లు జరుగుతున్నాయి. వన్డేలు చెన్నై, కోల్‌కత్తా, ఢిల్లీల లోనూ,టీ20లు బెంగళూరు, అహ్మదాబాద్‌లలోనూ నిర్వహిస్తారు.2007లో భారత్‌లో పాకిస్తాన్ పర్యటన తర్వత ఇరు దేశాలూ ముఖామఖి ఆడలేదు. 2008లో భారత్‌లో బాంబు దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు నిలిచిపోయాయి. హిందూవులు, దేశభక్తులు వచ్చే నెల నుంచి జరగబోయే భారత్ పాకిస్తాన్ క్రికెట్ సీరిస్‌ను అడ్డుకోవాలంటూ శివసేన అధినేత బాల్ థాక్రే సోమవారం పిలుపునిచ్చిన సంగతి తేలిసిందే…