పాక్ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అంతం చేయలేరు
ప్రధాని పర్వెజ్ వెల్లడి
ఇస్లామాబాద్:మాజీ ప్రధాని గిలానీని పదవి నుంచి తొలగించడంతో పాక్‌లో ప్రజాస్వామ్యం ముగిసిందనే వారి అభిప్రాయం తప్పని ప్రధాని రాజా పర్వెజ్ అష్రాఫ్ అన్నారు.ఆదివారం ఆయన సింద్ రాష్ట్రంలోని భుట్టో కుటుంబ సభ్యుల సమాదులన్న గర్హి ఖుదా బక్ష్‌లో విలేకరులతో మాట్లాడారు.ప్రపంచంలో ఎలాంటి శక్తి పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయలేదని ఆయన అన్నారు.”ఒక వ్యక్తి జైలు కెళ్లొచ్చు లేదా అంతం కావచ్చు అయినప్పటికి పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ సిద్దాంత పరంగా ముందుకెళుతూనే ఉంటుంది.మరింత పటిష్ఠం అవుతుంది”అని పర్వెజ్ అన్నారు.దేశంలో శాంతిభద్రతలు,విద్యుత్ సంక్షోభం తమ ముందున్న సవాళ్లని సమస్యలను సనిష్కారిస్తామని ఆయన అన్నారు.