పాటశాలల పున్ణప్రారంభంతోనే వలంటీర్ల నియామకం

మెదక్‌,జూన్‌8(జ‌నం సాక్షి): పాఠశాలలు పున్ణప్రారంభం కావడంతో రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటువలంటీర్లు కూడా విధుల్లోకి వచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో బోధన అందనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మంజూరైన వలంటీర్‌ పోస్టుల్లో అత్యధికంగా ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన ఎస్‌జీటీ పోస్టులు మంజూరు కాగా, ఉన్నత పాఠశాలలకు సంబంధించిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు , భాషా పండితుల పోస్టులు కూడా ఉన్నాయి. రోస్టర్‌ ప్రకారం ఆయా పోస్టులకు తగిన విద్యార్హతలు ఉన్న అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తరవాత ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. అభ్యర్థులు పాఠశాల విద్యాకమిటీకి ఒప్పంద పత్రాలు సమర్పించాల్సి ఉంది. ఆ తరవాత దరఖాస్తు చేసుకోవడం, పరిశీలన, అర్హుల ఎంపిక, నియామక పత్రాల అందజేత, ఒప్పందం చేసుకోవడం వంటి పక్రియలన్నీ పూర్తిచేస్తారు. మరోవైపుబడీడు పిల్లలను బడిలో చేర్పించాలని నినాదాలు చేస్తూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అన్ని గ్రా మాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం సాగింది.