పాఠశాలలలో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం
చిలుకూరు : మడలం కేంద్రంలోని సాయి గ్రామర్ పాటశాలలో గురువారం విద్యార్థులు ఘనంగా స్వపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్వవహరించి తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. డీఈవోగా తేజశ్రీ, ఎంఈవోగా శ్రీవిద్య,హెచ్‌ఎంగా శ్వేతల వేషధరణలు పలువురికి ఆకట్టు కున్నాయి. ఈకార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అనంత కృష్ణమాచార్యులు, ప్రిన్సిపల్ ఆంజనేయలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.