పాఠశాలలు తెరిచే నాటికి డ్రెస్సులు రెడీ

స్థానికంగానే కుట్టించి ఇచ్చేలా అధికారుల చర్యలు
వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఈ ఏడాది బడులు తెరిచే నాటికే అందుబాటులోకి రానున్నాయి. దుస్తులను కుట్టించే బాధ్యతలను యాజమాన్య కమిటీలకు అప్పగించారు. స్థానికంగా ఉన్న దర్జీలతో కుట్టించి జూన్‌ 1వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల విదార్థుల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దుస్తులు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది నుంచి 9,10వ తరగతి విద్యార్థులకు సైతం రెండు జతల దుస్తులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందని ఇటీవలే ఉప మఖ్యమంత్రి ప్రకటించారు. గతఏడాది ఏకరూప వస్త్రాలు ఆలస్యమైన నేపథ్యంలో ఈ ఏడాది ముందుస్తుగా నే అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. సమయానికి డ్రెస్‌లను అందజేయాలని మండల విద్యాధికారులకు, స్కూల్‌ కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు.  జూన్‌ 1 లోగా విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.ఇందుకు సంబంధించిన బట్టలు జిల్లాకు చేరడంతో పాటు పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన సకాలంలో విద్యార్థులకు దుస్తులు అందకపోవడం దృష్ట్యా ఈ విద్యా సంవత్సరం మాత్రం త్వరగానే అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఏటా రెండు జతలు అందజేస్తుంది. మొ దట్లో వీటిని పాఠశాలల్లో విద్యార్థుల కొలతలు తీసుకొని ప్రభుత్వమే కుట్టించి పాఠశాలలకు పంపిణీ చేసేది. దీంతో కొలతల్లో మార్పుల కారణంగా ఎగుడుదిగుడుగా రావడం, కుట్లు సరిగ్గా కుదరకపోవడంతో చాలా మంది విద్యార్థు వీటిని దరించడానికి ఇష్టపడక పోవడంతో విమర్శులు వచ్చిన నేపథ్యంలో గత రెండు సంవత్సరాల నుంచి నేరుగా ప్రభుత్వం పాఠశాలలకే వస్త్రాన్ని పంపిస్తుంది. పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలోనే స్థానికంగా ఉండే దర్జీలతోనే కుట్టించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత కొ న్నేండ్లుగా చాలాచోట్ల మండల వి ద్యాధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఈ అంశంపై అంతగా దృష్టి సారించక పోవడంతో విద్యార్థులకు సమయానికి దుస్తు లు అందడంలేదు. అందుకే ఈ ఎడాది వస్త్రాన్ని ముందుగానే పంపిణీ చేశారు. వేసవి సెలవుల్లో వీటిని కుట్టించి పాఠశాలలు ప్రారంభం కాగానే అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది.