పాఠశాలలో కరెంట్ షాకుతో విద్యార్థి మృతి
తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోదాడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యుత్ షాక్ కారణంగా ఆరో తరగతి విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. కోదాడ గ్రామానికి చెందిన పులుగు అన్నవరం (11) అనే విద్యార్థి శుక్రవారం పాఠశాలలోనే న్నుమూశాడు. పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. గ్రిల్ ఏర్పాటుచేసేందుకు పనివారు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బాలుని తల్లిదండ్రులు, బంధువుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా ఆందోళన చేపట్టారు.



