పాఠశాలల్లో మౌలిక వసతులపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పాఠశాలల్లో 6 నెలలలోపు మూత్రశాలలు, తాగునీటి వసతి కల్పించాలని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ వ్యవహారంపై మూడోసారి సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.