పాఠశాలల పటిష్టతలో స్థానికుల భాగస్వామ్యం
కెజి టూ పిజి కార్యాచరణకు పూనుకోవాలి
హైదరాబాద్,జనవరి3(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పనిచేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని భావించి ఇప్పుడు వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన ఈ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కెజి టూ పిజి విద్‌ఆయవిధానం అమలు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారుతెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఆశించిన మేరకు విద్యాప్రమాణాలు లేవని, అక్షరాస్యత లేదని, విద్యా సంస్థలు పనిచేయడం లేదని, ఇవన్నీ సరిగా కావాలంటే క్రమపద్దతిలో విధానాలు అమలు కావాలని భావించారు. అందుకు తగ్గట్లుగా గురుకులాలను ప్రారంభించారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరికీ తీసిపోని విధంగా తెలంగాణ విద్యార్థులుండాలని, అప్పుడే మనం కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కెసిఆర్ పదేపదే చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనకు అనుగుణంగానే ప్రయత్నం చేస్తున్నా, కెజి టూ పిజి మాత్రం పట్టాలకెక్కలేదు. ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాల్సి ఉందని మేధావులు కూడా అంటున్నారు. అప్పుడే మెరుగైన విద్యనందించగలమని, మంచి వసతులు కల్పించగలమని అన్నారు. ఈ విధంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులేనన్నారు. ఆయా జిల్లాలోని కార్పోరేట్ సంస్థల సహకారంతో స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేలా అందరూ కృషి చేయాలన్నారు. ఇక్కడ కావల్సిన అన్ని వసతులు కల్పించి, ఈ పాఠశాలను రాష్ట్రంలో నెంబర్ వన్ పాఠశాలగా చేసేలా ఉద్యమించాల్సి ఉంది.ఈ సంవత్సరం ఈ పాఠశాల పదో తరగతి ఫలితాలు వంద శాతం వచ్చేలా ఉపాధ్యాయులు కష్టపడాలని కూడా మేధావులు కోరారు.