పాఠశాల ఆవరణం, వంట చేసే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

 మండల విద్యాశాఖ అధికారి హబీబ్ అహ్మద్
కుల్కచర్ల, సెప్టెంబర్ 20(జనం సాక్షి):
పాఠశాల ఆవరణం, వంట చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల విద్యాశాఖ అధికారి హబీబ్ అహ్మద్ అన్నారు.మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన పరిశీలించారు.అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ..కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వంటచేసే పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, విద్యార్థుల కోసం ప్రభుత్వం ద్వారా అందే తృణధాన్యాల విషయంలో ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అల్పాహారం రూపంలో అందించాలని  కేజీబీవీ పాఠశాల సిబ్బందిని ఆయన సూచించారు.పాఠశాల ఆవరణం అపరిశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతారని, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అదేవిధంగా వంట విషయంలో కూరగాయలను పరిశుభ్రంగా కడిగి, వంట సామాగ్రిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల సిబ్బందిని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర కుల్కచర్ల సమూదాయపు సీఆర్పీ గాంగ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.