పాఠశాల పురోగతికి పేరెంట్స్ ఉపాధ్యాయుల సమావేశమే కీలకం – జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఐలయ్య
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 19 : పాఠశాల పురోగతికి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశమే కీలకమని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల హెచ్ఎం దండే అయిలయ్య అన్నారు. శనివారం ఆకునూరు ప్రాథమిక పాఠశాలలో స్థానిక హెచ్ఎం సందిటి సులోచన అధ్యక్షతన పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల ప్రగతికి ప్రభుత్వం నిర్దేశించిన ఎజెండా ప్రకారం విద్యార్థుల ఇంటివద్ద చదివే వాతావరణం, ప్రశ్నల పై చర్చ, విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల అభిప్రాయం, మన ఊరు మన బడి, పాఠశాల పరిసర ప్రాంత సౌకర్యాలు పిల్లల హాజరు, హోంవర్క్ తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన విద్యనందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మెడిచెల్మి అయోధ్య, తాటికొండ యాదయ్య, అక్కనపల్లి ఇంద్రసేనా రెడ్డి, గొంటి బుచ్చయ్య, ఉప్పల భాస్కర్, కామిడి రత్నమాల, విద్యార్థుల తల్లిదండ్రులు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఉడుత పర్శరాములు, సూర రాజు, కోడూరి శ్రీనివాస్,కల్లూరి నర్సింహులు, కళ్యాణం నర్సయ్య, కడారి సాయిబాబా, సూర సంపత్, బందరకంటి తేజ, ఆరే శోభ, రమ, స్వప్న, రజిత తదితరులు పాల్గొన్నారు.