పాఠశాల బస్సు ఢీకొని బాలుడి మృతి

విశాఖ : అచ్యుతాపురం మండలం దుప్పిటూరులో పాఠశాల బస్సు ఢీరొపి ఓ బాలుడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే బాలుని మృతికి కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలా : వరుస ప్రకృతి విలయాలు పిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. బోఫాతుపాను ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే దక్షిణ పిలిప్పీన్స్‌ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. మిందానావ్‌లో భూప్రకంపనలతో ప్రజలు వణికిపోయారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.6గా నమోదైంది. దావో పట్టణానికి 73 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. బోఫా తుపాను ప్రభావంతో పిలిప్పీన్స్‌లో 500 మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 18 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 8 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

గుజ్రాల్‌కు శాసనమండలి ఘన నివాళి

హైదరాబాద్‌: శాసనమండలి సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం సభను చైర్మన్‌ 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

ఏసీబీ వలలో వీఆర్వో

దౌల్తాబాద్‌ : లంచం తీసుకుంటుండగా ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం రామ్‌సాగర్‌ వీఆర్వో బాలయ్య లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. స్థానికంగా నివసించే చిట్టిమైన పోషయ్య అనే వ్యక్తి తన భూమి పట్టా మార్పిడి కోసం వీఆర్వోను శనివారం సంప్రదించగా ఇందుకోసం అధికారి రూ 2 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో సోమవారం ఇస్తానని చెప్పి పోషయ్య ఏసీబీ అధికారులకు సమాచారమందించాడు. ఈ రోజు పోషయ్య లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.