.పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం
– లిఫ్ట్‌లో ఇరుక్కుని చిన్నారి మృతి
హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి):
ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో లిఫ్టలో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. మలక్‌పేట మూసారంబాగ్‌లో శ్రీచైతన్య ఆధ్వర్యంలో నడుస్తున్న స్టార్ కిడ్స్ పాఠశాలలో జెహానా(5) అనే విద్యార్థిని లిఫ్టలో వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అందులో ఇరుక్కుపోయి మృతి చెందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న మలక్‌పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పాఠశాల ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.