పాణ్యం ఎమ్మెల్యేపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్ : కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని అమె ఫిర్యాదులో పేర్కొంది. స్ధానిక ఎస్పీ, ఎస్టీలకు చెందిన భూములను ఎమ్మెల్యే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని… దాన్ని తాను అడ్డుకున్నందుకే తనపై కక్ష పెంచుకుని తన అనుచరులతో దాడి చేయించాడని అమె అరోపించింది. తన ఇంటిని కబ్జా చేయడమే కాకుండా అనేకసార్లు తనపై హత్యాయత్నం చేశాడని రాజేశ్వరి కమిషన్‌కు వివరించింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని … ఇప్పటికైనా తనకు ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కమిషన్‌ను వేడుకుంది.