పాతబస్తీలో కొనసాగుతున్న 144 సెక్షన్
హైదరాబాద్: అల్లర్ల నేపథ్యంలో పాతబస్తీలోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. భారీగా అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బస్తీలో నిఘా కెమెరాలు, పికెట్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకూ అల్లర్లకు బాధ్యులైన 50 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఈరోజు వ్యాపార సంస్థలు తెరిచే విషయంపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు.