పాతబస్తీలో మరో కాంట్రాక్ట్ మ్యారేజ్
హైదరాబాద్, ఏప్రిల్ 6: నగరంలోని పాతబస్తీలో మరో కాంట్రాక్ట్ మ్యారేజ్ గుట్టురట్టయింది. అఫీస్‌బాబానగర్‌లో 17 ఏళ్ల బాలికతో యెమన్ దేశానికి చెందిన ఖనీస్‌మహ్మద్ అనే వ్యక్తితో కాంట్రాక్ట్ వివాహం జరిపించారు. అయితే తనకు బలవంతంగా వివాహం చేశారని, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాలిక ఫిర్యాదుతో యెమన్ దేశస్థుడు ఖనీస్ మహ్మద్ సహా పెళ్లికి సహకరించిన మరో ఐదుగురు మ్యారేజ్ బ్రోకర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేశామని, కాంట్రాక్ట్ మ్యారేజ్‌లు చేస్తే బ్రోకర్లపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ సత్యనారాయణ హెచ్చరించారు.