పాత జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలి :
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీమంత్రి , టీపీపీసి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర రెడ్డి డిమాండ్ చేశారు.గురువారం హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి పీఎస్ఆర్ సెంటర్ వరకు రోడ్ విస్తరణ పనులను పరిశీలించి, పలువురు దుకాణదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్ నిర్మాణ పనులను చేపట్టి మూడేళ్లయిన పూర్తి చేయకపోవడం వలన ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రోడ్ల మీద ఏర్పడిన గుంతలతో వాహనదారులతో పాటు పాదచారులు కూడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.వ్యాపారాలు లేక వ్యాపారస్తులు నష్టాల పాలవుతున్నారని అన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా అవసరం లేని చోట డివైడర్ల మధ్యన దారి ఇస్తున్నారని చెప్పారు.డిమార్ట్ వద్ద డివైడర్ల మధ్యలో రెండు దారులు వదలడం ఎందుకని ప్రశ్నించారు.తహసీల్దార్ , ఆర్డిఓ ఆఫీసులకు, మూడు దేవాలయాలకు, రాజీవ్ నగర్ వెళ్లే మార్గంలో డివైడర్ల మధ్య దారి వదలకుండా రోడ్ నిర్మాణం చేశారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెయిన్ రోడ్ విస్తరణలో భాగంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని, సామాన్య ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణ పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. రోడ్ విస్తరణ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించక పోవడం వల్లే రోడ్లు వేసిన కొద్ది రోజులకే గుంతలు పడి పాడవుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, టిపిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు అంజద్ ఆలీ ,పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area