పాత పెన్షన్ సాధన సంకల్ప సభ విజయవంతం

జనంసాక్షి ,చెన్నారావుపేట

మండల కేంద్రంలో టీఎస్సీపీఎస్ఈయూ మండల అధ్యక్షులు బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రవిచంద్ర సోనబోయిన మాట్లాడుతూ సీ పి ఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని కోరుతూ ఈ నెల 12 న హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) అధ్వర్యంలో నిర్వహించిన ఛలో హైదరాబాద్ పాత పెన్షన్ సాధన సంకల్ప బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ధన్యావాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు రెండు లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలను అర్థం చేసుకొని పాత పెన్షన్ అమలు చేస్తారని ఎదురుచూస్తున్నామని తెలియజేశారు.ఈ సభ కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష ఇరవై వేల మందికి పైగా హజయ్యారని,నర్సంపేట యూనిట్ చేన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి , నెక్కోండ, కొత్తగూడ, గంగారం మండలాల నుండి 8 బస్సుల్లో సుమారుగా సుమారుగా 350 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేశారని నర్సంపేట యూనిట్ డివిజన్ బాధ్యులు పాత శ్యాం ప్రసాద్ తెలియజేశారు.జిల్లా బాధ్యులు నీలం రమేష్ మాట్లాడుతూ పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర కోసం కోసం అన్ని విధాలుగా సహకరించిన పి ఆర్ టి యు టి ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి రవీందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల అధ్యక్షురాలు డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ నర్సంపేట యూనిట్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సభ విజయవంతం కోసం నిరంతరం కృషి చేశారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు.ఖానాపురం మండల ప్రధాన కార్యదర్శి పూనెం సురేందర్ గారు సిపిఎస్ విధానం ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో రద్దయిందని దక్షిణ భారతంలో రద్దయిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని కోరుకున్నారు.కొత్తగూడ మండలం ప్రధాన కార్యదర్శి సువర్ణపాక కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలోపే సిపిఎస్ విధానం రద్దు అవుతుందని ఎదురు చూస్తున్నట్టుగా తెలియజేశారు.అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు మనుగొండ రమేష్, చెన్నారావుపేట మండలం ప్రధాన కార్యదర్శి అజ్మీర స్వామి, నర్సంపేట ప్రధాన కార్యదర్శి శీలం మల్లయ్య , వంగ సంతోష్, శేఖర్, నరసింహ, భానోత్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు