పాముకాటుతో విద్యార్థు మృతి
కులకచర్ల: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన కులకచర్ల మండల పరిధిలో పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్ విద్యార్థి శివకుమార్ మృతి చెందగా, ఎనిమిదో తరగతి చదువుతున్న విష్ణు అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.