పాము కాటుతో రైతు మృతి
ఖానాపురం (వరంగల్) : పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఖానాపురం మండలంలో మంగళవారం ఉదమం జరిగింది. ధర్మారావుపేటకు చెందిన భువన రమేష్ ఈ ఉదయం పోలం వద్దకు వెళ్లి నీరు మళ్లించే క్రమంలో పాము కాటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు నర్సంపేటలోని అసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతునికి భార్య వనమ్మ . ఇద్దరు పిల్లలు ఉన్నారు.