పారిశుద్ధ్యంతోనే ఆసుపత్రిలో మెరుగైన వాతావరణం.
జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ధర్మీది రవిశంకర్ .
తాండూరు సెప్టెంబర్ 4(జనంసాక్షి) పారిశుధ్యంతోనే జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వాతావరణం లభిస్తుందని జిల్లా ఆసుపత్రి
సూపరింటెండెంట్ ధర్మీది రవిశంకర్ పేర్కొన్నారు. తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ప్రతి ఆదివారం పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలన పరిశుభ్రం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆదివారం ఆస్పత్రిలో ఏర్పడిన చెత్త మరియు అన్ని విభాగాల్లోనూ పారిశుధ్య కార్మికులు
పరిశుభ్రం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ధర్మీది రవిశంకర్
మాట్లాడుతూ ప్రతిరోజు జిల్లాస్పత్రికి తాండూర్ నియోజకవర్గంలో పాటు వివిధ గ్రామాల నుండి రోగులు జిల్లా ఆస్పత్రికి వస్తుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ ప్రతి ఆదివారం పారిశుధ్యం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల శ్రేయస్సు కోసం తగు జాగ్రత్తలు వహిస్తూ ఆసుపత్రిని అన్ని విధాల పరిశుభ్రం చేయించడం జరుగుతుందని వెల్లడించారు.