పారిశుద్ధ్య కార్మికులకు ఆఫ్రాన్ దుస్తులను పంపిణీ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28(జనం సాక్షి)
పారిశుద్ధ్య కార్మికులందరూ ప్రతి ఒక్కరూ ఆఫ్రాన్ దుస్తులను ధరించి విధులలో పాల్గొనాలని 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ అన్నారు.
బుధవారం రోజున 42వ డివిజన్ కార్యాలయంలో జి డబ్ల్యూ ఎం సి ద్వారా వచ్చిన ఆఫ్రాన్ దుస్తులను కార్పొరేటర్ డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులందరికీ పంపిణీ చేసినారు.
ఈ సందర్భంగా గుండు చందన పూర్ణచందర్మాట్లాడుతూ ఆఫ్రాన్ దుస్తులు ధరించి విధులు నిర్వహించడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్మికులందరికీ ఆఫ్రాన్ దుస్తులను అందజేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దామెరకొండ కరుణాకర్, ముత్తినేని రామమూర్తి, కన్నెబోయిన కుమార్ యాదవ్, మున్సిపల్ జవాన్లు ఖలీం, రమేష్ తొ పాటు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
Attachments area