*పారిశుద్ధ్య కార్మికుల సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే*

కోదాడ అక్టోబర్ 22(జనం సాక్షి)
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి వస్త్రాలు, చెప్పులు, నిత్యవసర సరుకులు తదితర సామాగ్రిని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామ పంచాయతీ మున్సిపల్ సిబ్బంది జీవితాలు దుర్భరంగా ఉండేవని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. వేతనాల పెంపుతో పాటు కార్మికుల సంక్షేమానికి అనేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.కరోనా ఈ సమయంలో కార్మికుల సేవలు వెలకట్టలేనివి అన్నారు. దేశ సరిహద్దుల్లో  సైనికులు శత్రువులు దాడి చేయకుండా రక్షిస్తుంటే పట్టణాల్లో గ్రామాల్లో నగరాల్లో పారిశుద్ధ్య కార్మికులు వ్యాధులు రాకుండా ప్రజలను రక్షిస్తున్నారన్నారు. కార్మికుల సేవలతోనే పారిశుద్ధ్యం సత్వరం జరుగుతుందన్నారు. పరిష్కారం కాకుండా ఉన్న కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మికుల పక్షపాతి అన్నారు. పారిశుద్ధ్యంలో కోదాడ పురపాలక సంఘాన్ని అగ్ర స్థానంలో నిలిపి కోదాడ మున్సిపల్ కార్మికులు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు  మైస రమేష్, కందుల చంద్రశేఖర్, అపర్ణ వెంకట్, కమధన చందర్ రావు, షఫీ, శిరీష శ్రవణ్, జ్యోతి శ్రీనివాస యాదవ్, కోట మధుసూదన్, ఫాతిమా కాజా, వంటిపులి రమా శ్రీనివాస్, ఖదీర్ భాష,గుండెల సూర్యనారాయణ, మేదర లలిత, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు పైడిమర్రి సత్యబాబు, అల్తాఫ్ హుస్సేన్, రాయపూడి వెంకటనారాయణ, కుక్కడపు బాబు, సూర్య రెడ్డి, మున్సిపల్ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Attachments area