పారిశుధ్య కార్మికుల ధర్నా

హైదరాబాద్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): చందానగర్‌ మున్సిపల్‌ కార్యాలయం ముందు చెత్తను తరలించే ఆటోలతో పారిశుధ్య కార్మికుల ధర్నా చేశారు. చేత్తను తరలించే ఆటోలను దీప్తిశ్రీ నగర్‌ కాలనీ లోపలి నుంచి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చెత్తను తరలించే ఆటోలను డంపింగ్‌ యార్డకు వెళ్లనీయకుండా కాలనీ వాసులు అడ్డుకుని తీవ్రంగా దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అయితే కార్లను అడ్డుపెట్టి కార్మికులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గం మరొకటి లేదని ..ఇలాంటి పరిస్థితుల్లో తాము ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. చేత్తను డంపింగ్‌ యార్డుకు తరలించడానికి కాలనీ వాసులు చూపిన రోడ్డు మార్గం గుంతల మయంగా ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంతల మయంగా మారిన రోడ్డు మార్గం గుండా వెళ్తే ఆటోలు డ్యామేజీ అవుతాయని..రిపేర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పారిశుధ్య కార్మికులు చెబుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్‌ అధికారులు అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. దీప్తిశ్రీ నగర్‌ కాలనీ వాసులతో అధికారులు మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తాజావార్తలు