పారిశుధ్య సమస్యలతో దోమల విజృంభణ

ఆసిఫాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది చెందీ డెంగ్యూ, మలేరియా లంటా జ్వరాలు వ్యాపాస్తున్నాయని అన్నారు. మురుగు కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో దోమలు వృద్ధి చెంది కంపుకొడుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసిన అపరిశుభ్ర ప్రదేశాలు దర్శనమిస్తున్నాయి. ప్రజల్లో సీజనల్‌ వ్యాధులు, అంటు వ్యాధులు, దోమల వృద్ధి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత తదితర విషయాలపై వైద్య అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాల్సి ఉన్నా అవిధంగా జరగడం లేదు. పంచాయతీ అధికారులు గ్రామంలోని మురుగు నీటి పారుదల, అపరిశుభ్ర ప్రదేశాలు, నీటి కుంటలు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలకు శాపంగా మారింది. దీంతో ఇంటింటికి ఇద్దరు ముగ్గురు చొప్పున జ్వరాలతో ఆసుపత్రులలో చికిత్స పొందున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు గ్రామంలో పర్యవేక్షించి పారిశుద్ధ్య సమస్యలపై చర్యలు చేపట్టాల్సి అవసరం ఉంది.కాసిపేట గ్రామపంచాయతీలోని మామిడిగూడెం గ్రామానికి చెందిన 20 మందికి పైగా డెంగీతో బాధపడుతున్నారు. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో మరికొంత మంది విష జ్వరాలతో అలమటిస్తుండగాఇటీవల అక్కడ వైద్య శిబిరం నిర్వహించారు. డెంగీ నిర్ధారణ కాగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్య సమస్యలే కారణం అని వైద్యులు తెలిపారు.