పార్కులను, హరితహార మొక్కలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
మెట్ పల్లి టౌన్, మార్చి 31,జనంసాక్షి :
మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ హరిత శుక్రవారం సందర్భంగా నేషనల్ హైవే రోడ్ లో నాటిన మొక్కలకు సాసరింగ్ చేయటాన్ని పరిశీలించి మున్సిపల్ సిబ్బందితో మొక్కలకు నీళ్ళను సరఫరా చేయించారు మరియు కుబ్ సింగ్ కుంట పార్క్, అంబేద్కర్ పార్కును పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిరోజు మొక్కలకు నీరు పట్టవలెనని తెలిపినారు విరిగిపోయిన చెట్లను పెరగని చెట్లను తీసివేసి కొత్త చెట్లను పెట్టవలెనని తెలిపారు, చెట్ల మధ్యన గడ్డి పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు ప్రతిరోజు మొక్కలకు ఉదయము సాయంత్రం నీరు అందించాలని తెలిపారు పార్కులను పరిశుభ్రంగా, సుందరంగా ఉంచాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముజీబ్,విజయ్ మధు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు