పార్టీల పోరులో కుల ప్రస్తావనను సరైనది కాదు

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హన్మంత్ రావు
శివ్వంపేట నవంబర్ 19 జనంసాక్షి: తెలంగాణ రాష్ట్రంలో
మున్నూరుకాపులు అన్ని రాజకీయ పార్టీలలో వారి వారి స్థాయిలను బట్టి పదవులలో కొనసాగుతున్నారని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మండల కేంద్రమైన శివ్వంపేటలో విలేఖ రులతో మాట్లాడుతూ రాజకీయ పోరులోకి మన మున్నూరు కాపు కుల సంఘాన్ని లాగవద్దని ఆయన హితవు పలికారు. రాజకీయ నాయకులు వారి పార్టీ యొక్క పార్టీ అధిష్టానం ఆదేశాలతో వారి పార్టీల సిద్ధాంతాలు కట్టుబాట్లపై పని పనిచేస్తున్నారు. ఇటువంటి రాజకీయ నేపథ్యం ఉండి, ఆన్ లైన్ లోనే వ్యక్తిగత దాడులు, దానికి ప్రతీదాడులు దిగుతున్నారని, ఒకరిపై ఒకరు నిందా ఆరోపణలు, ప్రత్యరోపణలు చేసుకుంటున్నారన్నారు.  ఇటువంటి రాజకీయ పార్టీల వివాదాలకు  కులాల కుంపటిగా మార్చడం సభ్య సమాజం మనలని హర్షించదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎవరికి కూడా మంచిది కాదని , సమాజంలో మన పాత్ర గౌరవప్రదమైనదని,
దీన్ని కుల సంఘం అధ్యక్షులు గా కొండా దేవయ్య కుల దాడిగా చిత్రీకరించడం తీవ్రంగా తీవ్రంగా తాము ఖండిస్తున్నామన్నారు. నాగరిక సమాజములో అన్ని కులాలు సఖ్యతతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో మనుగడ సాగించాలి తప్ప, పాసిస్టు పద్ధతి లో రెచ్చగొట్టడం మున్నూరుకాపులను సమాజం నుండి దూరం చేయడమే అవుతుందని హన్మంత్ రావు చెప్పారు.  టీఆరెఎస్ పార్టీ వారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,  సర్పంచ్ నుండి జిల్లా పరిషత్ చేర్మన్లు దాకా కార్పొరేషన్ చేర్మన్లుగా ఎంతో మందికి పదవులు కట్టబెట్టారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరుకాపు కుల బంధువుల మనోభావాలు దెబ్బ తీయడం ఒక రాజకీయ పార్టీకే మున్నూరు కాపులు కొమ్ము కాస్తున్నట్లుగా దేవయ్య వత్తాసు పలకడం ఒక కుల సంఘ నాయకుని లక్షయం కాదని కల్లూరి హనుమంతరావు అన్నారు. ఇటువంటి సంఘటనలు సంఘంలో చోటు చేసుకున్నప్పుడు, మన సంఘంలో ఉన్న రాష్ట్ర కమిటీ ని సమావేశపరిచి, విషయ పరిజ్ఞానం ఉన్నవారితో చర్చలు జరిపి, కులహితానికి పని చేయాలి తప్ప, కులాన్ని పార్టీల పోరుకు బలిచేయవద్దని ఆయన కోరారు. ఆ రాజకీయ దుమారమైన వివాదాన్ని
మున్నూరు కాపులు పార్టీల పోరుగా చూడాలి తప్ప, కులం పైన దాడిగా చూడొద్దని కె హెచ్ ఆర్  విజ్ఞప్తి చేశారు