పార్థసారథి రాజీనామాకు హైకమాండ్‌ ఆదేశం

న్యూడిల్లీ : మంత్రి పార్థసారథి రాజినామా చేయాలని కాంగ్రేస్‌ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రి పార్థసారథి వ్యవహరంపై రాష్ట్రవ్యవహరాల ఇన్‌చార్జీ గులాం నబీ అజాద్‌ స్పందించారు. సీఎం కిరణ్‌ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆజాద్‌ అన్నట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి ఆఫిస్‌ పనిలో భీజీగా ఉన్నందున స్పందించలేకపోయానని అజాద్‌ చేప్పారు. ఫెరా నిమంధనలు ఉల్లంగించిన పార్థసారదికి ఆర్ధిక నేరల ప్రత్యేక కోర్టు రెండు నెలల జైలు శిక్ష విదించిన విషయం తెలిసిందే.