పార్థీవ్ పటేల్‌కు అవకాశం
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ మంగళవారం 16సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.తాజాగా జట్టులో ఒక మార్పు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వికెట్ కీపర్ సాహా స్థానంలో పార్థీవ్ పటేల్‌కు చోటు కల్పించింది. ఈ మార్పు మొహాలీ వేదికగా జరిగే మూడో టెస్టుకు మాత్రమే అని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. సాహా గాయం బారిన పడటంతో ఈ మార్పు చేసినట్లు బీసీసీఐ ట్విటర్‌లో తెలిపింది.