పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి
ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి ప్రారంభమవుతాయని లోక్‌సభ ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేసింది, సమావేశాలు డిసెంబరు 20 వరకు సాగే అవకాశం ఉన్నట్లు ఈ ప్రకటన పేర్కొంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వివిధ అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు మొండిపట్టు పట్టడంతో సమావేశాల సమయమంతా వాయిదాల పర్వంలో వృధా ఆయిన విషయం తెలిసిందే.