పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం

` గ్యాలరీనుంచి లోక్‌సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు
` టియర్‌ గ్యాస్‌ వదడంతో అప్రమత్తమైన సిబ్బంది
` ఆగంతకులను పట్టుకుని భద్రతా సిబ్దందికి అప్పగింత
` ఘటనతో భయబ్రాంతులకు గురై పరుగులు తీసిన ఎంపిలు..
` లోక్‌సభ వాయిదా.. ఘటనపై విచారణకు ఆదేశించిన స్పీకర్‌ ఓంబిర్లా
న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంటులో భద్రతావైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడిరది. బుధవారం  లోక్‌ సభ జరుగుతున్న సమయంలో పబ్లిక్‌ గ్యాలరీనుంచి ఇద్దరు యువకులు అకస్మాత్తుగా సభలోకి దూకారు. నల్లచట్టాలను రద్దుచేయాలి అంటూ వారు నినాదాలు చేస్తుండగా, కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో సభ వాయిదాపడిరది. 2001లో పార్లమెంటుపై ఇదే రోజున దాడి జరిగింది. తిరిగి అదే రోజున ఈ సంఘటన చోటు చేసుకోవడం కలవరం రేకెత్తిస్తోంది.లోక్‌ సభలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు లోక్‌సభలోకి దూకి టియర్‌ గ్యాస్‌ను వదిలారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే ప్యానల్‌ స్పీకర్‌ సభను వాయిదా వేశారు. ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొత్త పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. స్పీకర్‌ వైపు ఓ ఆగంతకుడు పరిగెత్తాడు. కాగా 2001లో ఇదే రోజు పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి చేశారు. 22 ఏళ్ల తర్వాత పార్లమెంట్‌పై మరోసారి దాడి జరిగింది. కొత్త పార్లమెంట్‌ లోక్‌సభలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అయితే ఆ ఇద్దరిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారని, వారిని విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఎంపీలు తెలిపారు.ఈ సంఘటనపై పార్లమెంటు సభ్యుడు కార్తీ చిదంబరం మాట్లాడుతూ అకస్మాత్తుగా ఇద్దరు యువకులు విజిటర్స్‌ గ్యాలరీలోంచి సభలోకి దూకారు. వారి చేతిలో ఉన్న పొగడబ్బాలలోంచి పసుపు రంగులో పొగ వెలువడుతోంది. వారిలో ఒకడు స్పీకర్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది పార్లమెంటులో భద్రతావైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆగంతకులు చోర్చుకురావడంపై ఎంపీ రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందన్నారు. దీని వెనుక ఎవరున్నారు అనేది తేలుతుందని అన్నారు. లోక్‌ సభలో జరిగిన ఘటనపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ఎంపి డిరపుల్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. ఇది లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన అని.. ఇక్కడికి వచ్చే వారందరూ ` అది సందర్శకులు లేదా రిపోర్టర్‌లు.. వారు ట్యాగ్‌లను కలిగి ఉండరు. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను. ఇది పూర్తి భద్రతా లోపం అని నేను భావిస్తున్నాను. లోక్‌సభ లోపల ఏదైనా జరిగి ఉండవచ్చని  అంటూ డిరపుల్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. పార్లమెంట్‌లో బుధవారం మధ్యాహ్నం 1.02 గంటలకు జీరో అవర్‌లో ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని పసుపు రంగు పొగను వెదజల్లుతూ సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి లోక్‌సభ ఛాంబర్‌లోకి పరుగెత్తడంతో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఈ ఘటనపై విచారణ జరిపించే బాధ్యత తనదని లోక్‌ సభ స్వీకర్‌ ఓం బిర్లా వెల్లడిరచారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.నిందితులు వదిలిన గ్యాస్‌ ఏమిటి అనేదానిపై విచారణ చేస్తున్నామన్నారు. ఎంపిల ఆందోళనను పరిగణలోకి తీసుకున్నామని స్వీకర్‌ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని ఆయన వెల్లడిరచారు. తగిన చర్యలు తీసుకోవాలని ఢల్లీి పోలీసులను ఆదేశించామన్నారు. విచారణ తర్వాత అన్ని విషయాలు బయటకొస్తామని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు అమోల్‌ షిండే కాగా, మరొక మహిళ పేరు నీలమ్‌ కౌర్‌ గా గుర్తించారు. నియంతృత్వం ఇక చెల్లరు అంటూ నిందితులు విూడియా ముందు నినాదాలు చేశారు.
పార్లమెంట్‌ భద్రతపై అనుమానాలు
పార్లమెంట్‌లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అలజడి సృష్టించిన నేపథ్యంలో పార్లమెంట్‌ వద్ద చొటోచేసుకున్న భద్రతా వైఫల్యాలు కొత్త పార్లమెంట్‌ వద్ద భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గతంతో పోలిస్తే పార్లమెంట్‌ వద్ద భద్రతా వ్యవస్థ మరింత మరింత పటిష్టం చేసినప్పటికీ స్మోక్‌ బాంబులతో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్‌ గ్యాలరీలోకి ఎలా ప్రవేశించగలిగారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత పాత పార్లమెంట్‌ భవనం వద్ద భధ్రతను ప్రక్షాళన చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ స్థానంలో నాలుగు అంచెల భద్రతా వ్యవస్థ అమలులోకి వచ్చింది. పార్లమెంట్‌ వద్ద ఢల్లీి పోలీసుకు చెందిన ప్రత్యేక విభాగంతోపాటు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కంటింజెంట్‌ను ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ ఇండస్టియ్రల్‌ సెక్యూరీ ఫోర్స్‌, అగ్నిమాపక దళంతోసహా ఇతర సంస్థలను భద్రతా వ్యవస్థలో మమేకం చేశారు. భద్రతా పక్రియలో భాగంగా పార్లమెంట్‌ వద్ద సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. భైతిక తనిఖీలతోపాటు సందర్శకుల వద్ద ఉండే వస్తువులన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ జరుగుతుంది. ఫోన్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లతోపాటు చిల్లర నాణెళిలను సైతం లోపలకు అనుమతించరు. సందర్శకులు తప్పనిసరిగా తమ ఆధార్‌ కార్డులను చూపించాల్సి ఉంటుంది. మూడు ఫుల్‌ బాడీ స్కానర్లను దాడుటకునే లోపలకు ప్రవేశం ఉంటుంది. ఈ పక్రియ అంతా పూర్తయిన తర్వాతే సందర్శకులకు పాసులు జారీ చేస్తారు. సందర్శకుడి నేపథ్యాన్ని గురించి ఆరా తీసిన తర్వాత పాసుల జారీ జరుగుతుంది. పార్లమెంట్‌ సభ్యుడు సంతకం చేసిన సిఫార్సు లేఖలపైనే పాసులు జారీ చేస్తారు. పార్లమెంట్‌లోని విజిటర్స్‌ గ్యాలరీలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు వ్యక్తులు స్మోక్‌ బాంబులను తమ షూ లోపల దాచి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని తనిఖీ చేస్తున్న సమయంలో షూల విషయాన్ని భద్రతా సిబ్బంది విస్మరించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఫుల్‌ బాడీ స్కానర్లను వారిద్దరూ ఎలా తప్పించుకుని ఉంటారన్నది మాత్రం అంతుచిక్కడం లేదు.

(లోక్‌సభలో ఘటనపై పూర్తి బాధ్యత నాదే
` దర్యాప్తుకు స్పీకర్‌ ఓం బిర్లా హావిూ
దిల్లీ(జనంసాక్షి):  పార్లమెంట్‌ సమావేశాల వేళ లోక్‌సభ లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు.ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హావిూ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు.దీనికి స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ.. ‘’లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, నిందితులు వదిలిన గ్యాస్‌ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం’’ అని వెల్లడిరచారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్‌ అన్నారు.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లోక్‌సభలో దుండగులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ వద్ద ఒకరకమైన గ్యాస్‌ను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు. అదే సమయంలో పార్లమెంట్‌ భవనం వెలుపల మరో ఇద్దరు రంగుల పొగలు వదిలారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఈ నలుగుర్ని అరెస్టు చేశారు.