పాలనలో రాజకీయ జోక్యం తప్పనిసరి

4

లేదంటే ప్రజాస్వామ్య  స్పూర్తికి విఘాతం

ప్రధాని నరేంద్ర  మోదీ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 21 (జనంసాక్షి):

పాలనలో రాజకీయ జోక్యం తప్పనిసరిగా మారిందని దీన్ని అనివార్యంగానే భావించాలని ప్రధాని నరేంద్ర మోడి పేర్కోన్నారు. లేదంటే ప్రజలు ఎన్నుకోన్న  ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను అగౌరవ పరచినట్టేనని ఇది ప్రజాస్వామ్మ స్పూర్తికే విఘాతమని దిల్లీలో జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ డే కార్యక్రమంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.    ఉద్యోగజీవితం ఒత్తిడితో ఉంటే ఏమీ సాధించలేమని, వ్యక్తిగత-వృత్తిగత జీవితాల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  కుటుంబంతో నాణ్యమైన సమయం గడపాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. ప్రభుత్వాన్ని తద్వారా దేశాన్ని ముందుకు నడిపించాల్సిన ఉద్యోగులు అలసి పోయి, సీరియస్‌గా ఉండడం తనకు ఇష్టంలేదన్నారు. తన బృందం ఎనర్జెటిక్‌గా ఉండాలని మోదీ పేర్కొన్నారు.