పాలమూరులో నేడురేపు మహిళా కవి సమ్మేళనం
మహబూబ్‌నగర్,మార్చి8(జనంసాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈనెల 9,10 తేదీల్లో జిల్లా కేంద్రంలో తెలంగాణ మహిళా సాహిత్య సదస్సు, మహిళా కవిసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కవి, ప్రముఖన్యాయవాది వీ మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి 250కి పైగా మహిళ కవులు హాజరై తమ కవిత్వాలు, కథ, నవల, నాటకం, గేయం, పరిశోధన, చరిత్ర, పత్రిక, జానపదం, అనువాదంతోపాటు తదితర అంశాలపై ప్రసిద్ధ పరిశోధకులు పత్ర సమర్పణ చేస్తారని తెలిపారు. 9వ తేదీన నిర్వహించనున్న కార్యక్రామానికి రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, యువజన సర్వీసులు, సాం స్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య ఆకాడవిూ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధా అమర్‌తోపాటు తదతర ప్రముఖులు హాజరుఅవుతారని తెలిపారు. 10వ తేదీన నిర్వహించనున్న కార్యక్రామనికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సంగీత నాటకరంగ ఆకాడవిూ చైర్మన్ బాద్మి శివకుమార్ హాజరు అవుతున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామని అన్నారు. సదస్సులను తెలంగాణ సాహిత్య అకాడవిూ సౌజన్యంతో పాలమూరు సహిత మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కవులందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.