పాలెస్‌ చెత్తకుండీ అయింది

untitled-1555444
– మనసు నొచ్చుకున్న మైసూర్‌ మహారాజు

మైసూరు,అక్టోబర్‌ 13(జనంసాక్షి):మైసూరు మహారాజు యదువీర్‌ ఒడియరును ప్రజలు నొప్పించారు. దసరా పర్వదినం సందర్భంగా వూరేగింపులు, విందు వినోదాలతో మైసూరు ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. వేడుకల అనంతరం ప్యాలస్‌ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. ప్యాలస్‌లోని దర్బార్‌ హాలులో ప్రజలు తినిపారేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, ప్లేట్లు, పేపర్‌ బ్యాగులు చెల్లాచెదురుగా పడివున్న ఫొటోను యదువీర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.”ఇలా ఎక్కడపడితే అక్కడ చెత్త పారేస్తే మన మైసూరు శుభ్రమైన నగరం అన్న బిరుదును కోల్పోతుంది. ప్యాలస్‌ సినిమా థియేటర్‌ కాదు అన్న విషయం ప్రజలు ఎప్పుడు అర్ధం చేసుకుంటారు (అలాగని థియేటర్‌లో చెత్త పడేయొచ్చని నా ఉద్దేశం కాదు). ఇప్పటివరకు దర్బారు ప్రాంగణంలో తినడానికి ఎప్పుడూ అనుమతించలేదు. ఉత్సవాల సమయంలో మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది మనం గుర్తుంచుకోవాలి” అంటూ పోస్ట్‌ చేశారు. గత రెండేళ్లుగా భారత్‌లోనే అత్యంత శుభ్రమైన నగరంగా మైసూరు పేరుపొందింది. ఈ నేపథ్యంలో యదువీర్‌ ఒడియరు ఆగ్రహం వ్యక్తంచేశారు. అందులోనూ మైసూరు ప్యాలస్‌ నుంచి బన్నిమంటప వరకు ఏనుగులపై ఐదు కిలో విూటర్ల వరకు వూరేగించడంతో ప్యాలస్‌ ప్రాంగణం మొత్తం చెత్తతో పేరుకుపోయింది. యదువీర్‌ పోస్ట్‌కి … నిజమే.. ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు అంటూ ఎందరో కామెంట్‌ చేశారు.