పింక్ వాక్ ప్రారంభించిన ఎంపీ కవిత
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎంపీ కవిత అన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద రోమ్ము క్యాన్సర్పై అవగాహన వాక్ ను ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, మంచు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. కేన్సర్ను మొదటిలోనే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడోచ్చునని తెలిపారు. కేన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రముఖులందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నిర్వహించిన బ్రెస్ట్ కేన్సర్పై అవేర్నెస్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.