పింజర్ల సబ్సిడీలు ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తాం

ఆసాముల సమన్వయ కమిటీ. పాలిస్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షలు.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21. (జనంసాక్షి). బతుకమ్మ చీరలకు సంబంధించి ఆసాములకు రావలసిన పింజరల సబ్సిడీని తక్షణమే ఇవ్వాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అసాములు డిమాండ్ చేశారు. సోమవారం ఆసాములకు రావలసిన పింజరలా సబ్సిడీని తక్షణం ఇవ్వాలని కోరుతూ పాలిస్టర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఎదుట నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసాముల సంఘం నాయకులు మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఉత్పత్తికి సంబంధించి గతంలోనే అధికారులు పాలిస్టర్ యజమానులు పింజర సబ్సిడీని అందిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం పింజరల సబ్సిడీని తక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం యజమానులు స్పందించాలని కోరారు. సబ్సిడీ ఇచ్చేంతవరకు నిలవధిక ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరసన దీక్షలో పలువురు ఆసాములు పాల్గొన్నారు.