పిఎం ప్రణయ్ పథకం వ్యవసాయ రంగానికి శాపం

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు
వీపనగండ్ల అక్టోబర్ 21 (జనంసాక్షి) రైతులకు అందించే ఎరువుల సబ్సిడీ ఎత్తివేసేందుకే పీఎం ప్రణయ్ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు అన్నారు. మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో వనపర్తి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం రెండో మహాసభలు రెండవ రోజు జిల్లా అధ్యక్షులు రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు వేణు ఎగరవేశారు. అనంతరం జరిగిన సభలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మంచి ఆదాయ వనరుగా, వ్యవసాయ రంగాన్ని కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టేందుకు భాగంగానే రైతులకు సబ్సిడీ తగ్గించి పీఎం ప్రణయ్ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. సంపద సృష్టిస్తున్న అసంఘటిత కాల పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కొంతమంది కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకు నరేంద్ర మోడీ కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజలను అభివృద్ధికి, దేశాన్ని అభివృద్ధి పథంలో కృషి చేస్తున్నామని చెబుతున్న మోడీ మాటలు నీటి మాటలే అని ఎద్దేవ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచి పెడుతున్నారని అన్నారు. దేశంలో ఆకలి, దారిద్రం, శిశు మరణాలు అధికంగా ఉన్నాయన్నారు. ఆహార భద్రత చట్టాన్ని 11 రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. మిలటరీ రంగంలో 60 సంవత్సరాల సర్వీసును తగ్గించి, నాలుగు సంవత్సరాలకు పనిచేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేయడం, దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కరువు అవుతాయని అన్నారు.