పిడిఎస్ అక్రమ బియ్యం రవాణాన్ని అడ్డుకున్న ఎస్ఐ.
చండ్రుగొండ, సెప్టెంబర్ 15(జనంసాక్షి):- భద్రాద్రి జిల్లాలో కొందరు రేషన్ డీలర్లు దొడ్డి దారిన రేషన్ బియ్యం మాఫియాతో అంట కాగుతున్న విషయంలో జనంసాక్షి వరుస కథనాలతో అప్రమత్తమైన జిల్లా అధికారులు పేదోడి బియ్యంపై అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపారు.తాజాగా చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో బుధవారం రాత్రి సుమారు 20క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా ఎస్సై విజయలక్ష్మి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.