పిడుగుపడి ముగ్గురు మృతి
మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సదాశివపేట మండలం వెల్టూరులో పిడుగు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో దానయ్య, మల్లేషం, అనిల్ ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రభాకర్ పరామర్శించారు.