పిడుగుపాటుకు ఇద్దరు మృతి

 

– తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి హరిశ్‌ రావు
– మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటన
సిద్దిపేట జిల్లా ప్రతినిధి,అక్టోబర్‌ 6(జనంసాక్షి):సిద్దిపేట జిల్లా కేంద్రం చింతల్‌ చెరువు కట్టపై పిడుగు పడి హనుమాన్‌ నగర్‌ కి చెందిన పస్తం శ్రీనివాస్‌ , బాల రాజు ఇద్దరు మృతి చెందారు , ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ సంఘటన పై మంత్రి హరీష్‌ రావు తీవ్రగ్భ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం పక్షాన మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. వారి మృతి బాధాకరం వారి మృతి పట్ల సంతాపం తెలిపారు.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వ వైద్య కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెన్నూరు సారయ్యను పరామర్శించారు.. మెరుగైన చికిత్స అందించాలని అవసరమైతే హైదరాబాద్‌ కు తరలించాలని అధికారులను ఆదేశించారు.