పిడుగుపాటుకు రైతు మృతి
వెల్దుర్తి : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో పిడుగుపాటుకు ఓ రైతు దుర్మరణం చెందాడు. నిన్న రాత్రి వర్షం పడుతున్న సమయంలో పొలం వద్దకు కాపలా కోసం వెళ్లిన సయ్యా అంజనేయులు (40) అనే రైతుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.