పిల్లలలో లోప పోషణ తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలి.
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి.
పిల్లలలో లోప పోషణను తగ్గించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య, మహిళా శిశు సంక్షేమ అధికారులకు సూచించారు.
మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోషణ మాసం కార్యక్రమంపై జిల్లా వైద్యశాఖ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించబడింది.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలలో పోషణ లోపం తగ్గించడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఏ ఎన్ సీ రిజిస్ట్రేషన్లు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలలో రక్త హీనత నివారణ, పోషకాహార లోపంతో బయటపడుటకు ప్రతి స్థాయిలో కృషి చేయాలని, పిల్లలలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వారి స్థితిని మార్చడంలో, కొత్త పిల్లలను బక్కపలచదనంతో రాకుండా చూడడంలో ముందుండి జీరో స్థాయి లోప పోషణ ఉన్న జిల్లాగా మార్చాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డి.ఎం.హెచ్.వో. లు, సిడిపివోలు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.