పిల్లల బరువులు ఎత్తు కొలిచేటప్పుడు ఆయలు టీచర్లకు సహకరించాలి

మండల కేంద్రంలోని రైతు భవనంలో మల్దకల్,గట్టు,ఐజ,మండలాల అంగన్వాడి హెల్పర్స్ లకు ప్రాజెక్టు స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది.ఈ సమావేశానికిసిడిపిఓ కమలాదేవి హాజరై మాట్లాడుతూ ఆయాల అందరూ సమయాపాలన పాటించాలని ఉదయం 9 నుండి 4 గంటల వరకు కేంద్రంలోనే ఉండాలని ఆదేశించారు.కేంద్రాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని,
పిల్లలకు ప్రతి రోజు ప్రార్థన చేయించాలి.అంగన్వాడీ కేంద్ర పరిధిలో జరిగే కార్యక్రమాలన్నీ అనగా ప్రీస్కూల్ కార్యక్రమాలు ,రిజిస్టర్ ల నిర్వహణ, గృహ సందర్శనలు ,వంటి కార్యక్రమాలలో టీచర్లకు సహాయంగా పని చేయాలన్నారు.కేంద్రం పరిధిలో గలసున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నెంబర్లను సేకరించి టీచర్లకు అందించాలని చెప్పారు.అంగన్వాడి కేంద్రంలో భోజనానికి ముందు తర్వాత పిల్లలకు సబ్బుతో చేతులు కడిగించే అలవాట్లను నేర్పించాలని చెప్పారు.
పిల్లల బరువులు, ఎత్తు, లు కొలిచేటప్పుడు టీచర్లకు సహకరించాలి.
అంగన్వాడి కేంద్రాలలో ఆయాలు ఎవరైనా 60 సంవత్సరాలు పైబడిన వారు తమ విధులు నిర్వహించుటకు ఆరోగ్య సమస్యలు లేదా వయస్సు రిత్యా   సహకరించకపోతే స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు  చేసుకోగలరని సూచించారు.
అనంతరం అంగన్వాడి సహాయకుల చేత ప్రీస్కూల్ కార్యక్రమాలైనా ఆటలు, పాటలు ,కథలు ,ప్రాక్టీస్ చేయించారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు నాగరాణి, బాలమ్మ ,మూడు మండలాల అంగన్వాడి సహాయకులు హాజరయ్యారు.