పి హెచ్ సి సులానగర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
టేకులపల్లి, ఆగస్టు 15( జనం సాక్షి) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్, డాక్టర్ విద్యాసాగర్ జెండా ఆవిష్కరణ, వందన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగంలో ఇప్పటి దాకా సాధించిన విజయాలు, ఇంకా సాధించవలసిన లక్ష్యాలపై వివరించారు .ఆరోగ్యమే మహాభాగ్యం అని ఏ దేశమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఆరోగ్యంవంతమైన సమాజం ఉన్నప్పుడే ఆ దేశ ప్రగతి అనుకున్న విధంగా జరుగుతుందని, కాబట్టి ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి మనం సైనికుల లాగా నిరంతరం పనిచేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి వైద్యాధికారులు పిలుపునిచ్చారు. కరోనా లాంటి భయంకరమైన పాండమిక్ వచ్చినప్పుడు మనం ఏవిధంగా పని చేసామో దేశ ప్రజలు అందరూ గుర్తించి ప్రశంసలు అందజేయడం జరిగిందని, ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ , సత్యవతి, పోరండ్ల శ్రీనివాస్, శకుంతల, గుజ్జ విజయ ,ధర్మపురి రవికుమార్ ,అక్బర్, వేదమని, సాజిదా బేగం , ధనసరి రాంబాబు, ఏఎన్ఎం లు పాల్గొన్నారు