పీఎఫ్‌ వడ్డీరేటు నిర్ణయించండి

 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13)ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌)పై చెల్లించే వడ్డీరేటును ఇంకా నిర్ణయించకపోవటంపై ఏఐటీయూసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌) దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున ఖర్గే తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు.