పీఎల్‌జీఏ వారోత్సవాలు విజయవంతం చేయండి

‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ను ఓడించండి.

– సీపీఐ మావోయిస్టు పార్టీ జాతీయ నేత దేవ్‌జీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :

పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ నాయకుడు దేవ్‌జీ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన ఆదివారం పత్రిక కార్యాలయాలకు ఒక లేఖను పంపారు. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భారత నూతన ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం, అంతర్జాతీయ కార్మికవర్గ సైన్యానికి చెందిన ఒక విభాగంగా, భరత విప్లవ మహోపాధ్యయులు చారుమజుందార్‌, కన్హాయ్‌ చటర్జీల పథ నిర్దేశంలో ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) 2000 సంవత్సరం డిసెంబర్‌ 2 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 12వ వారోత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. దోపిడీ పాలకవర్గాలు ప్రజలపై సాగిస్తున్న యుద్ధం ‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ను ప్రజాయుద్ధం ద్వారా ఓడించేందుకు గెరిల్లాయుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ యేడాది దాదాపు వందమంది కార్మికుల కుమారులు, కుమార్తెలు, సాధారణ ప్రజలు ఈ పోరులో తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు. విప్లవోద్యమ నాయకుడు, ప్రజాయుద్ధ సేనానీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీని కేంద్ర, బెగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు, బెంగాల్‌ ఎస్‌ఐబీ సహా కేంద్ర ఇంటెలిజెన్స్‌ సంస్థలు కుట్రలు పన్ని బలిగొన్నాయని తెలిపారు. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు హరక్‌ (శ్రీకాంత్‌) అనారోగ్యంతో, ఉత్తర తెలంగాణ ఎస్‌జెడ్‌సి సభ్యుడు గుండేటి శంకర్‌ (శేషన్న) పాముకాటుతోనూ, జార్ఖండ్‌లోని ఛత్‌రా జిల్లా కుందా అడవుల్లో బీహార్‌-ఝార్ఖండ్‌-ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ సెపషల్‌ ఏరియా నాయకుడు అజయ్‌ గంజూ పోలీసుల చేతిలో హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. అసోంలో బూటకపు ఎన్‌కౌంటర్‌లో లీడింగ్‌ టీం సిద్ధార్థ బుర్గోహెయిన్‌తో పాటు ముగ్గురు అమరులయ్యారని తెలిపారు. దండకార్ణయంలో దక్షిణ ఆర్‌సి సభ్యుడు విజయ్‌ ఒక దుర్ఘటనలో, సీనియర్‌ కార్యకర్త స్వరూప (సునీత) అనారోగ్యంతో అమరులయ్యారని తెలిపారు. కార్మికోద్యమ నేత, పీడిత ప్రజల న్యాయవాది బిఎస్‌ఎ సత్యనారాయణ, శ్రీకాకుళ పోరాట యోధుడు గోరు మాధవరావు, ఆదివాసీ నాయకుడు పెందురు భీంరావు తుదిశ్వాస విడిచారని తెలిపారు. పోలీసు హత్యాకాండలో దాదపు 60 మంది సాధారణ ప్రజలు, ప్రజాసంఘాలు, విప్లవ ప్రజా కమిటీల కార్యకర్తలూ నేలకొరిగారని పేర్కొన్నారు. దండకారణ్యంలోని బీజాపూర్‌ జిల్లా బాగూడ ప్రాంతంలో సార్కిస్‌గూడ ఊచకోతలో 19 మంది నిరాయుధ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వారందరికీ పేరుపేరునా అరుణాంజలి ఘటిస్తూ వారి ఆశయసాధన కోసం ప్రతినబూనుదామన్నారు.

భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంతో భారత దోపిడీ పాలకవర్గాలు అమెరికా సామ్రాజ్యవాదుల నిర్దేశత్వంలో విప్లవ ప్రతీఘాతుక వ్యూహాన్ని (ఎల్‌.ఐ.సి) పకద్బందీగా అమలుజరుపుతున్నాయని, దీనిని ప్రతిఘటించడం కోసం ఈ యేడాది వివిధ గెరిల్లాజోన్లలో పీఎల్‌జీఏ చేపట్టిన వివిధ ఎత్తుగడల ఎదురుదాడి క్యాంపెయిన్లు, ప్రతిఘటనా చర్యలు రాజకీయంగా మంచి ప్రభావాన్ని వేశాయి. దండకారణ్యంలోని కోయ కమాండో కమాండర్లు కరటం సుర్య, కిచ్చ నందల వాహనంపై గొర్‌గొండ వద్ద జరిగిన అంబుష్‌ (సుక్మా), పుస్‌టోలా వద్ద సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా బలగాల కాన్వాయ్‌పై నిర్వహించిన సాహసోపేత భారీ అంబుష్‌ (గడ్చిరోలి), ఇర్పుగుట్ట అంబుష్‌ (కాంకేర్‌), కిరందుల్‌ నైట్‌ అంబుష్‌ (దంతేవాడ), సల్వాజుడుంనాయకుడు, కాంగ్రెస్‌ నాయకుడు, నరహంతక మహేంద్ర కర్మపై అంబుష్‌ (దంతేవాడ), ఝార్ఖండ్‌లో బరగఢ్‌ వద్ద మైన్‌ప్రూఫ్‌ వాహనంపై జరిగిన దాడి (లాతేహార్‌), ఎన్‌హెచ్‌-2పై ఆంబుష్‌ (లాతేహార్‌), గిరిడి పట్టణంలో ఖైదీల ఎస్కార్ట్‌ వాహనంపై దాడి -8 మంది మావోయిస్టు ఖైదీల విడుదల, బీహార్‌లో గయ జిల్లా బాల్‌ధోర్‌, డుమరియా అడవుల్లో ఒకే రోజు సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా బలగాలపై పిఎల్‌జిఏ సాగించిన సమరాలు, శకర్‌బాంథా వద్ద మైన్‌ప్రూఫ్‌ వాహనంపై అంబుష్‌, ఏఓబిలో జన్నిగూడ (డైక్‌ థ్రీ) అంబుష్‌ 9చిత్రకొండ-బలిమెల రోడ్డు), సీలేరు సింగిల్‌ యాక్షన్‌, ఒడిషాలో బదరపంగ ఆంబుష్‌ (కంధమాల్‌), ఉత్తర తెలంగాణలో ఒక నైట్‌ అంబుష్‌, పశ్చిమ బెంగాల్‌లో గ్వాల్తోర్‌ ఆంబుష్‌ (లాల్‌గఢ్‌ ప్రాంతం) వంటి చర్యలు, అనేక సింగిల్‌ యాక్షన్లు, ఇతర యుద్ధచర్యలలో 114 మంది పోలీసులు మరణించగా, 191 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని తెలిపారు. వారి వద్ద నుంచి 29 ఆయుధాలను పిఎల్‌జిఏ హస్తగతం చేసుకుంది. పిఎల్‌జిఏ గెరిల్లా చర్యల వల్ల శత్రువు మరిన్ని బలగాలను మన ప్రాంతంల్లో మోహరించాల్సి స్థితికి, తన బలగాలను విశాల ప్రాంతాలలో వికేంద్రీకరించాల్సిన స్థికి నెట్టబడ్డారని తెలిపారు. ఫలితంగా శత్రుదాడిని నిలువరించడంలో పిఎల్‌జిఏ బలగాలు విజయం సాధించగలిగాయని తెలిపారు.

గత యేడాది మధ్య భాగం నుంచి ఉద్యమ ప్రాంతాలపై శత్రువు దాడుల్ని మరింత తీవ్రతరం చేశాడని, ఉద్యమ ప్రాంతాల్ని దెబ్బతీసే, ముక్కలుగా ప్రాంతాల్ని తెగ్గొట్టి, మన సమన్వయాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఈ ఆపరేషన్లును చేపడుతున్నాన్నరు. ప్రజలపై సార్కిన్‌గూడ్‌ వంటి ఊచకోతలు, విప్లవ నాయకుల, కార్యకర్దల హత్యలు పెరుగుతున్నాయి. సల్వాజుడుం, నాగరిక్‌ సురక్షా సమితా, టిపిసి, ఎస్‌పిఎం, హర్మద్‌ వాహిని, భైరవ్‌సేన, శాంతి కమిటీ, శాంతి సంఘం వంటి విప్లవ ప్రతీఘాతక గ్యాంగులు, రహస్య హంతక ముఠాలు, పోలీసు, పారామిలటరీ, కమాండో బలటాలు సంయుక్తంగా ఇలాంటి ఉచకోతలకు దిగుతున్నాయి. మవోయిస్టులను, ‘టెర్రరిస్టులను’ ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎన్‌.సి.టి.సి. (నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌) దేశ ప్రజల నామమాత్ర సార్వభౌమత్వానికీ, శాంతికీ, భద్రతకూ, సేవఛ్చకూ, ప్రజాస్వామ్యానికీ, జీవించే హక్కుకూ అతి పెద్ద ముప్పుగా పరిణమించనుంది.

విప్లవోద్యమ నిర్మూలన కోసం సైన్యాన్ని దించుతున్నారు. భారత సైన్యం, వాయుసేన చేపట్టనున్న దాడులకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని నిర్మిస్తున్నారు. సైనిక దాడులకు మద్దతుగా వాయుసేనతో దాడులు చేయడం కోసం ఛత్తీస్‌గఢ్‌, విదర్భ, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, ఝార్ఖంఢ్‌, ఒడిషాలలోని అనేక ప్రాంతోల్లో ఎయిర్‌ బేస్‌ల నిర్మాణం కొనసాగుతోంది. నాలుగు ట్రై-జంక్షన్స్‌ (మూడు రాష్ట్రాల కూడళ్లు) ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్‌- మహారాష్ట్ర ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌-జార్ఖండ్‌-ఒడిషా, ఒడిషా-పశ్చిమ బెంగాల్‌-జార్ఖండ్‌లలో 400 ఫొర్టఫైడ్‌ పోలీస్‌స్టేషన్లు నిర్మస్తూ కార్పెట్‌ సెక్యూరిటీని బలోపేతం చేస్తున్నారు. పిఎల్‌జిఏ బలగాలు చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనే విధంగా బలగాలకు శిక్షణ, ఆయుధాలు, సామగ్రి అందజేస్తున్నారని తెలిపారు. డ్రోన్‌ (యుఏవి) దాడుల కోసం సన్నాహాల్ని వేగవంతం చేస్తూ ఫీల్డులో ఉన్న నాయకత్వాన్ని నిర్మూలించడంపై కేంద్రీకరిస్తున్నారు. కదలికలపై నిఘా ఉంచే లక్షయంతోనే 2012 ఏప్రిల్‌ చివర్లో రిసాట్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించారన్నారు. విప్లవ శిబిరాన్ని చీలదీసి, దోపిడీ వర్గాల సామాజిక పునాదిని పెంచుకునే సంస్కరణల్ని తీవ్రతనరం చేస్తున్నారని తెలిపారు. వీటన్నింటి ద్వారా రాజకీయ నాయకుల, అధికారుల, కాంట్రాక్లర్ల, తెగ పెద్దల, పెత్తందార్ల, ధనిక, మధ్యతరగతి రైతాంగంలోని ఒక సెక్షన్‌కు ఆర్థిక లాభాలు చేకూర్చి వారిని తమకు సామాజిక పునాదిగా ఉపయోగించుకుంటున్నారన్నారు. సోషలిజం-కమ్యూనిజానికి కాలం చెల్లిందని, అది విజయం సాధించలేదని ఒకవైపు, 5-10 యేళ్లల్లో విప్లవోద్యమాన్ని దెబ్బతీస్తాం, మీరు (విప్లవ శిబిరం) గెలువలేరు కాబట్టి విప్లవోద్యమాన్ని వదిలిపెట్టి పోలీసుల్లో చేరండి, ఇన్‌ఫార్మర్లుగా

మారండని మరోవైపు నిరంతరం మానసిక యుద్ధం చేస్తున్నారు. సవ్యసాచి పండా వంటి వారిని ప్రోత్సహిస్తూ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

వనరుల దోపిడీి కోసం, సామ్రాజ్యవాద కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపదలను దోచిపెట్టడం కోసం విప్లవకారులపై, పీడిత ప్రజలపై క్రూరమైన, హేయమైన, అమానవీయమైన దాడులకు దిగడం, మావోయిస్టు పార్టీ నేతృత్వంలో మొగ్గతొడుగుతున్న ప్రత్యామ్నాయ ప్రాజారాజ్యాధికారాన్ని రూపుమాపడం భారత పాలకవర్గాల, వారి సామ్రాజ్యవాద ప్రభువుల లక్షయ్యం, దేశవ్యాప్తంగా ప్రజాయుద్ధాన్ని, ప్రజాస్వామిక, రాజకీయ ఆందోళనలను తీవ్రతరం చేయడం ద్వారా భారత దోపిడి పాలకవార్గల దాడిని ఓడించాల్సిందిగా పీడిత ప్రజలకు, ప్రజాశ్రేయోభాలాఘలకు సిఎంసి పిలుపు నిస్తోందని పేర్కొన్నారు.

ప్రపంచ పెట్టుబడీిదారి వ్యవస్థలో తలెత్తిన ఆర్థిక సంక్షభం మరింత లోతుగా విస్తరిస్తూకొనసాగుతున్నది. సామ్రాజ్యవాదం సంక్షభం నుంచి గట్టెక్కడానికి ఒకవైపు తమ దేశాల్లో కార్మికుల పైన, మద్యతరగతి ప్రజానీకంపైన దోపిడిని  తీవ్రతరం చేయడమే కాకుండా వెనుకబడినదేశాల్లోని అన్ని రకాల వనరులను (మానవ, బౌతికవనరులను) కొల్లగొట్టేందుకు సామ్రాజ్యవాదులు పోటీ  పడుతున్నారు. అమెరికాలో, ఇతర సామ్రాజ్యవాద  దేశాలలో రేసిజం నానాటికీ పెచ్చరిల్లుతుందనడంతో సిక్కులు,తూర్పు ఆసియావాసులు, దక్షిణాసియావాసులు, ముస్లింలు, అరబ్బులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా గత  యేడాది కాలంగా యూరప్‌లోని అనేక దేశాల్లో కార్మికులు,యువతరం, మహిళలు, మధ్యతరగతి ప్రజానీకం  ఆందోళనలు చేస్తున్నారు. కార్మికవర్గ పార్టీలు, ప్రగతిశీల ప్రజా సంస్థలు తిరిగి బలం పుంజుకుంటున్నాయన్నారు. వెనుకబడిన  దేశాలన్నింటిలో  సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు వేర్వేరు రూపాల్లో తీవ్రతరమవుతున్నాయి. అరబ్‌  ప్రజావెల్లువ తర్వాత  అక్కడ తిరిగి అమెరికా అనుకూల పాలకులే మరో రూపంలో అధికారంలోకి రావడంతో ప్రజలు  అనివార్యంగా విప్లవ  మార్గాన్ని అవమానపరిచే  అమెరికా సినిమాకు వ్యతిరేకంగా ప్రపంచవ్యప్తంగా ముస్లిం ప్రజానీకం భగ్గుమంది. ఫిలిప్పైన్స్‌,ఇండియాలలో మావోయిస్టు  ప్రజాయుద్దం  పురోగమిస్తుండడం, నేపాల్‌లో యుసిపిఎన్‌ చేపట్టిన  రివిజనిస్టు  పంథాను వ్యతిరేకిస్తూ విప్లవశక్తులు వేరుపడడం, టర్కీ,  పెరూ, బంగ్లాదేశ్‌  తదితర  దేశాలలో మావోయిస్టు శక్తులు క్రీయశీలంగా ఉండడం, యూరప్‌లోని  పలు దేశాల్లో మావోయిస్టు సంస్థలు,  సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థలు మన దేశంలో సాగుతున్న ప్రజాయుద్దానికి సంఘీబావంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం సానుకూల పరిణామమన్నారు.

మన దేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా మౌలిక వైరుధ్యాలన్నీ  తీవ్రతరమవుతున్నాయి. సంపన్నులు మరింత సంపన్నులవుతుంటేపేదలు మరింత పేదలవుతున్నారు. దేశ జనాభాలో 77 శాతం ప్రజలు రోజుకు కనీసం 20 రూపాయలు ఖర్చు చేయలేని కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ,  రాబర్ట్‌ వాడ్రా,  కేంద్ర మంత్రులు శరద్‌ పవార్‌, సల్మాన్‌ కుర్షీద్‌, బీజేపీ అధ్యక్షుడు  నితిన్‌ గడ్కరి తదితరుల కుంభకోణాలు బయటపడుతూ ఒక్కోక్కరి  ముసుగును చింపివేస్తున్నాయి. ఈ ఆర్థిక అంతరాలు, అవినీతి సామాజిక  అశాంతికి కారణమవుతూ విప్లవానికి వనరుగా మారుతున్నాయి. జల్‌- జంగల్‌- జమీన్‌ కోసం నిర్వాసిత సమస్యకు వ్యతిరేకంగా ఆదివాసులు తదితర రైతాంగం, వ్యవసాయ రంగంపై సబ్సీడీల  ఎత్తివేతకు  వ్యతిరేకంగా గిట్టుబాటు ధరల కోసం ఎరువులు, పురుగు మందుల  కల్తీకి వ్యతిరేకంగా కరెంట్‌ కోసం విత్తనాల పరిరక్షణ కోసం రైతంగాం  అధిక ధరలు, నిరుద్యోగం, కరువు, ఆకలి చావులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారని కొనియాడారు.