పీఎస్‌ఎల్‌వీ 29 కౌంట్‌డౌన్‌

1
నెల్లూరు,డిసెంబర్‌14(జనంసాక్షి): భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. ఈనెల 16న నింగిలోకి దూసుకుపోనున్న పీఎస్‌ఎల్వీ సీ-29 రాకెట్‌ ప్రయోగానికి.. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో కౌంట్‌డౌన్‌ మొదలు కానుంది. ఈ రాకెట్‌లో 6 విదేశీ ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టనున్నారు. పీఎస్‌ఎల్వీ సీ-29 సింగపూర్‌కు చెందిన 6 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. మొత్తం రాకెట్‌ బరువు 227.6 టన్నులు. ఇందులో ప్రధాన ఉపగ్రహం బరువు 400 కిలోలు. ఈ రాకెట్‌ భూమి నుంచి 550 కిలోవిూటర్లు ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోనుంది. ఇక ఇప్పటికే పీఎస్‌ఎల్వీ సీ-29 రాకెట్‌ ప్రయోగానికి షార్‌ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 59 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన అనంతరం 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-29 నింగిలోకి దూసుకెళ్లనుంది.