పీడీఎస్ బియ్యం పట్టివేత

*ఇరవై క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో పాటు అశోక్ లేల్యాండ్ వాహనం ,
*పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు ,
*పరారీలో మరో వ్యక్తి ,

 

ఖానాపురం అక్టోబర్14 జనంసాక్షి

 

పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి అక్రమంగా అశోకాలేలాండ్ వాహనంలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ఎట్టకేలకు టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు .వివరాల్లోకి వెళితే కొత్తగూడెం మండలం పొగుళ్లపల్లి గ్రామ పరిసర ప్రాంతాల నుండి పేదలకు అందవలసిన పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు స్వీకరిస్తూ వాటిని కొత్తగూడ మండలం నుండి అధిక ధరలకు వేరే చోటుకు తరలిస్తున్నారని టాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం చేరడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు కొత్తగూడెం మండలంలోని గుంజేడు మీదుగా వస్తున్న వాహనాన్ని ఖానాపురం మండలంలోని నాజి తండ గ్రామం మీదుగా వస్తుండగా నాజి తండ గ్రామంలొనెిిిదుర్గమ్మ గుడి వద్ద పోలీసులు పట్టుకున్నారు .అశోకాలేలాండ్ వాహనంలోముగ్గురు నిందితుల్లో ఒకరు పారిపోగా ఒకరు ఇద్దరు నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నిందితులుకొత్తగూడెం మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు .అశోక్ లేలాండ్ డ్రైవర్స్ పoజరాజు ,మరో వ్యక్తి జుూలవంశీ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి రాగి పరారీలో ఉన్నట్టు తెలిపారు . కాగా పట్టుబడ్డ ఇరవై క్వింటాళ్ల బియ్యంతోపాటు అశోక్ లీలాండ్ వాహనాన్ని ఖానాపురం పోలీస్స్టేషన్కు తరలించారు .విషయంపై ఖానాపురం ఎస్సై పిట్టల తిరుపతిని వివరణ కోరగా నాజి తండా గ్రామం వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు వారు ధ్రువీకరించారు .ప్రస్తుతం విచారణ కొనసాగుతుందన్నారు .అక్రమంగా తరలి వెళుతున్న పీడీఎస్ బియ్యం రవాణాను ఎట్టకేలకు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న టాస్క్ఫోర్స్ ఎస్ఐ లవన్ కుమార్, టాస్క్ఫోర్స్ సిబ్బందిని అడిషనల్ డీసీపీ అభినందించారు .