పుట్ట మధు బీసీలకు చేసింది ఏమీ లేదు..!
మంథని, (జనంసాక్షి) : బిసి బిడ్డ అని చెప్పుకునే పుట్ట మధు బీసీల కోసం చేసిన ఏమీ లేదని, పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా బీసీల సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదని, కేవలం ఓట్ల కోసమే బీసీ, బహుజన వాదాన్ని పుట్ట మధు ఎత్తుకున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఓబీసీ సెల్ మాజీ వైస్ చైర్మన్, డాక్టర్ పి.వినయ్ కుమార్, టిపిసిసి అధికార ప్రతినిధి కొనగల మహేష్ లు ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని కామారెడ్డి సభలో ప్రకటించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపడుతామని స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచుతామన్నారు. మంథని చరిత్ర గురించి దశాదిశలు తెలిసేలా పివి నరసింహారావు, దుద్దిల్ల శ్రీపాదరావు చేశారని, దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్న సమయంలో మంథని నియోజక వర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని వారి పాలనలో మంథని ప్రశాంత వాతావరణం ఉండేదన్నారు. కానీ నేడు మంథని మినీ బీహార్ గా మారిందన్నారు. మంథనిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలన్న మంథని నియోజక వర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా మంథని నియోజకవర్గం ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి శ్రీధర్ బాబును మంథని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శశి భూషణ్ కాచే, కొండ శంకర్, ఊదరి శంకర్, మూల పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.