పునర్‌వ్యవస్థీకరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి: వినోద్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ,మార్చి2(జ‌నంసాక్షి):  లోక్‌సభలో కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై లోక్‌సభలో ఎంపీ వినోద్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌-3 ప్రకారం ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు పాసయ్యిందని.. రాజ్యాంగం ప్రకారం బిల్లులో మార్పులు చేయాలంటే రెండు రాష్టాల్ర అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఏ నిర్ణయమైనా ఇరు రాష్టాల్రను సంప్రదించిన తర్వాతే తీసుకుంటామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పలుసార్లు చెప్పినట్టు పేర్కొన్నారు. అయితే ఎలాంటి చర్చ చేయకుండా, అసెంబ్లీల అభిప్రాయాలు తీసుకోకుండా చేయడం సరికాదన్నారు. కేంద్రం రెండు రాష్టాల్రను సంప్రదించకుండా బిల్లుకు సవరణ చేస్తే ఇబ్బందులేర్పడతాయని హెచ్చరించారు. ఏపీలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య పెంపు అంశంపై తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఏపీలో కలిసిన ఏడు మండలాలకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్‌ను సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. ఏడు మండలాల్లోని గిరిజనులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌ను అందిస్తున్నట్టు తెలిపారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రిని డిమాండ్‌ చేశారు. వివిధ అంశాలపై ఇంకా స్పస్టత రాలేదన్నారు. ఇవన్నీ చర్చించాల్సి ఉందన్నారు. వీటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం ఎమ్మెల్సీ సీట్ల పెంపుపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం సరికాదన్నారు.