పురాతన ఇళ్లలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి.. తహాసిల్దార్ గంగాధ
జనం సాక్షి (జులై14):
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పురాతన ఇండ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, ముందస్తు జాగ్రత్తగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉండాలని తహాసిల్దార్ గంగాధర్ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ 8వ వార్డు పరిధిలో సుమారు 30 ఇళ్ళు
వర్షాలకు దెబ్బతిన్నాయని వారిని ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు
అజాగ్రత్తగా ఉండకుండా కరెంటు స్తంభాలకు, వైర్లకు దూరంగా ఉండి, నీటి కుంటలు, చెరువుల వద్ద ప్రవహించే నీటి వద్దకు వెళ్లరాదని ఆయన ప్రజలకు సూచించారు. ఆయన వెంట రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి,మున్సిపల్ కమిషనర్ రమేష్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, కౌన్సిలర్లు వెంకటేష్, బాడీ శ్రీను, నాయకులు కనుకుట్ల రాజు, నార్ల ఉదయ్, కిరణ్ అమీర్ యూనుస్, వడ్ల శివ, వినోద్ తహాసిల్దార్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.